26-04-2025 08:37:02 PM
కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్ చేయాల్సిందే..
ఎంపీ డీకే అరుణ..
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): ప్రభుత్వము ఏర్పాటు కాకముందు కాంగ్రెస్ పార్టీ ఒక విధంగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మరో విధంగా అలసత్వం ప్రదర్శించడం ఎంతవరకు సమంజసం అని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ(Mahabubnagar MP DK Aruna) ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం పాలమూరు యూనివర్సిటీలో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రోఫెసెర్ల చేస్తున్న నిరవధిక సమ్మె సందర్శించి ఎంపీ మద్దతు తెలియజేసి మాట్లాడారు. 2008లో ఇక్కడ యునైసర్సిటీ ఉండాలని పోరాడి ఏర్పాటు చేసుకున్నామని, తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ నాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రూ.100 కోట్ల నిధులు ఇప్పించుకున్నామని గుర్తు చేశారు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత యూనివర్సిటీ నిర్వహణ నిర్లక్ష్యం ప్రారంభమైందని, రాష్ట్ర వ్యాప్తంగా 12 యూనివర్సిటీలలో ధర్నాలు చేయడం బాధాకరమన్నారు. తమ న్యాయపరమైన డిమాండ్స్ కోసం ధర్నాలు చేస్తే అరెస్ట్ చేస్తారా..? అని ప్రశ్నించారు. 750 మందిని దౌజన్యంగా అరెస్ట్ చేశారని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు సీఎం అవగానే మర్చిపోయావా ప్రశ్నించారు. చిత్త శుద్ధి ఉంటే ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటను సీఎం నిలబెట్టుకోవాలని, నాణ్యమైన విద్యను అందించే కాంట్రాక్టు, గెస్ట్ లెక్చరర్లను వెంటనే రెగ్యులరైజ్ చేయాలన్నారు. యూజీసీ అంశంపై కేంద్రం ప్రభుత్వంతో మాట్లాడుతానన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం వివరించడం సరికాదని వెంటనే స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కాంట్రాక్టు అధ్యాపకులు తదితరులు ఉన్నారు.