calender_icon.png 20 April, 2025 | 2:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరిపాలన అదనపు బాధ్యతలకు కాంట్రాక్ట్ అధ్యాపకుల రాజీనామా

16-04-2025 12:20:39 AM

టీయూ సౌత్ క్యాంపస్ లో 19 నుండి కాంట్రాక్ట్ అధ్యాపకుల  నిరవదిక సమ్మె   

కామారెడ్డి, ఏప్రిల్ 15( విజయక్రాంతి):  తెలంగాణ విశ్వవిద్యాలయం దక్షిణ ప్రాంగణంలో బి టి ఎస్ క్యాంపస్ లో   పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు  సంచల నిర్ణయం తీసుకున్నారు. తాము నిర్వహిస్తున్న  అదనపు పరిపాలన బాధ్యతలను   దక్షిణ ప్రాంగణ ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్ సుధాకర్ గౌడ్ కు తమ  రాజీనామ పత్రాలను మంగళవారం అందించారు. ఈనెల 19వ తేదీ నుండి   తాము నిరవధిక సమ్మెకు వెళ్తున్నట్టు  ప్రిన్సిపాల్ కు  సమ్మె నోటీసులు  అందజేశామన్నారు . గత కొన్ని సంవత్సరాలుగా తాము విశ్వవిద్యాలయ అభివృద్ధికి, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం నిరంతరం కృషి చేస్తూ టీచింగ్ తో పాటు  అదనపు పరిపాలన బాధ్యతలను  నిర్వహిస్తున్నామన్నారు .

గత 15 ,20 సంవత్సరాలుగా విశ్వవిద్యాలయాల అభివృద్ధికి కృషి చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్న  తమ గురించి  ఏలాంటి సానుకూల నిర్ణయం తీసుకోకపోవడంతో ఆవేదనకు గురవుతున్నామన్నారు.  కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో  ప్రకటించి తమను విస్మరించడం  ప్రజా పాలనలో  ఇలాంటి వివక్షదోరణి ఉండటం  బాధాకరమన్నారు. రాజీనామా సమర్పించిన వారిలో  బాయ్స్  హాస్టల్ వార్డెన్  డాక్టర్ యాలాద్రి, గరల్స్ హాస్టల్ వార్డెన్ డాక్టర్ సునీత, ఉమెన్ సెల్ అసిస్టెంట్ డైరెక్టర్ కే వైశాలి, ఏపీఆర్‌ఓ  డాక్టర్ సరిత  రాజీనామ సమర్పించి  తమ సమస్యలను పరిష్కరించకపోతే .

తమ ఆందోళనను  మరింత ఉధృతం చేస్తామన్నారు.  ఈ సందర్భంగా రాష్ట్ర కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు డాక్టర్ ఎస్ నారాయణ మాట్లాడుతూ  భద్రత లేని  బతుకులకు భరోసా ఇవ్వాలన్నారు. అదనపు బాధ్యతలతో విశ్వవిద్యాలయాల అభివృద్ధికి  ఎంతో కృషి  చేశామని  కానీ ప్రభుత్వం స్పందించకపోవడంతో  తాము నిర్ణయం తీసుకున్నామన్నారు.. ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వం చర్చలు జరిపి తన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ యాలాద్రి, డాక్టర్ సునీత, డాక్టర్ రమాదేవి, డా నరసయ్య,  కే వైశాలి, డాక్టర్ సరిత, డాక్టర్ నిరంజన్, డాక్టర్ శ్రీకాంత్  తదితరులు పాల్గొన్నారు.