calender_icon.png 24 October, 2024 | 7:59 PM

కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి

15-07-2024 12:34:27 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 14 (విజయక్రాంతి): మైనార్టీ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని 2000 సంవత్సరంలో నియామకమైన కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు కోరారు. ఉమ్మడి ఏపీలో 2000 నుంచి 2003 సంవత్సరాల మధ్య కాలంలో రెసిడెన్షియ ల్ స్కూల్స్ సొసైటీ కింద తమ నియామకాలు జరిగాయని, అయితే  2014 లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీని తెలంగాణ మైనారిటీ విద్యా సంస్థల సొసైటీలో విలీనం చేసి, కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల సేవలను అలాగే కొనసాగించారన్నారు. తెలంగాణలో మొ త్తం 5 ఇఖామీ మదర్సాలు పనిచేస్తున్నాయని, అందులో తెలంగాణ సాం ఘిక సంక్షేమం, గిరిజన సం క్షేమం, బీసీ సంక్షేమం, రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీ, మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీలు పేర్కొనదగినవి అన్నారు. ప్రభుత్వం స్పందించి మైనార్టీ స్కూల్స్ లో టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని కోరారు.