01-03-2025 12:47:52 AM
భద్రాద్రి కొత్తగూడెం ఫిబ్రవరి 28 ( విజయక్రాంతి) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఏరియాలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ గా గత 8 సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్న వీ రబాబు అనే ఉద్యోగిపై కక్ష సాధింపులో భాగంగా ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ వేధింపులకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ఆజాద్ అధికార్ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్చార్జ్ బోడికల ప్రేమ్ దయాళ్ కొత్తగూడెం సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పొందుతూన్న సెక్యూరిటీ గార్డ్ వీరబాబు ను శుక్రవారం కలిసి పరామర్శించారు.
ఘట నపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..18 నెలల క్రితం అనారోగ్య సమస్యల కారణంగా శస్త్రచికిత్స పొంది ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో నిత్యం బరువైన వస్తువులను మోపియడం ద్వారా శస్త్రచికిత్స చేసిన భాగంలో అంతర్గత బ్లీడింగ్ జరిగి తీవ్ర ఆవేదన చేందుతున్నడని విచారం వ్యక్తం చేశారు. నిత్యం ఏదో ఒక ఏరియాలో కాంట్రాక్ట్ ఉద్యోగులపై అధికా రులు వేధింపులకు పాల్పడడం సర్వసాధా రణంగా మారిందన్నారు. ఇక నైన అధికా రులు తమ తీరు మార్చుకోవాల న్నారు.
పెరేడ్ పేరుతో వెట్టిచాకిరి చేస్తున్నానే ఆయన ఆరోపించారు. చికిత్స పొందుతున్న ప్రైవేటు సెక్యూరిటీ గార్డ్ పూర్తి బాధ్యత యాజ మాన్యమే వహించాలని ఆయన డిమాండ్ ఈ సంఘటనపై పూర్తి స్థాయి విచారణ చేసి దోషులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.