16-04-2025 12:29:39 AM
నేడు ఇందిరాపార్క్ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 15(విజయక్రాంతి): కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులర్ చేయా లని కోరుతూ తెలంగాణ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫె సర్స్ జేఏసీ ఆధ్వర్యంలో నేడు ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేపట్టనున్నారు. బుధవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించబోయే ఈ ధర్నాలో బీజే పీ ఎంపీ ఈటెల రాజేందర్, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు, రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్య, సీపీ ఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, ప్రొ.హరగోపా ల్, జస్టిస్ సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీ తీ న్మార్ మల్లన్న, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, తదితరులు పాల్గొని మద్దతు తెలపనున్నారు.సమావేశంలో యూ నియన్ నాయకులు డా.ధర్మతేజ, డా.పరశురాం, డా.ఉపేందర్, డా. కుమార్, డా.విజయేందర్‌రెడ్డి, డా.ఓ కృష్ణ, డా.తిరుపతి, డా.పాం డయ్య, డా. తాళ్లపల్లి వెంకటేశ్వర్లు, డా.రేష్మారెడ్డి, పాల్గొన్నారు.