26-04-2025 12:23:59 AM
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్
కామారెడ్డి, ఏప్రిల్ 25 ( విజయక్రాంతి), తెలంగాణ విశ్వవిద్యాలయం దక్షిణ ప్రాంగణం లోని కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు చేపట్టిన నిరవధిక నిరసన దీక్ష రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రిలే దీక్షలు 7వ రోజుకు చేరు కు న్నాయి. ఈ సందర్భంగా వారు చట్టసభల్లో బహిరంగంగా ఇచ్చిన హామీలను గుర్తుచేసేలా నిరసన చేపట్టారు.
ముఖ్యంగా, శాసనసభలో భట్టి విక్రమార్క గారు, దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు సీతక్క మాట్లాడుతూ రెగ్యులరైజేషన్ అవసరాన్ని స్పష్టంగా ప్రభుత్వం మాట ను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తెలంగాణ విశ్వవిద్యాలయం ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా నియమించబడ్డామని, కాంట్రాక్ట్ అసోసియేట్ ప్రొఫెసర్ లు విశ్వవిద్యాలయ అధికారులు ఒక కమిటీ ద్వారా ( హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, సబ్జెక్టు ఎక్సపర్ట్ , ప్రిన్సిపల్, రిజిస్టర్ ) ద్వారా ప్రభుత్వం ప్రభుత్వం చేత నియమించబడిన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆమోదంతో తమ నియామకం జరిగిందని అన్నారు.
ప్రస్తుతం 15- 20 సంవత్సరాల నుండి తాము విశ్వవిద్యాలయ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని, కానీ తమ జీవితానికి భరోసా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు పీహెచ్డీ, నెట్, సెట్, పబ్లికేషన్స్, యూజీసీ మార్గదర్శకాల ప్రకారం అన్ని అర్హతలు ఉన్నప్పటికీ, ఇప్పటికీ అస్థిరత ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ యూనివర్సిటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ స్టేట్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డా. ఎస్ నారాయణగుప్త, డాక్టర్ యాలాద్రి, డా. సునీత ,డా. నరసయ్య, డాక్టర్ నిరంజన్, డాక్టర్ శ్రీకాంత్, వైశాలి తదితరులు పాల్గొన్నారు.