16-04-2025 01:28:06 AM
జిల్లా ఎస్పీ మహేష్ బి గితే
సిరిసిల్ల, ఏప్రిల్ 15 (విజయ క్రాంతి): రౌడీ షీటర్ల పై నిరంతరం నిఘా పెంచడంతోపాటు అసాంఘిక కార్యపాలు చేపట్టే వారిపై కఠిన చర్యలు చేపడతామని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గితే అన్నారు. మంగళవారం గంభరావుపేట, ముస్తాబాద్ పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా ఆయన తనిఖీ చేశారు అనంతరం ఎస్పి మాట్లాడుతూ.. ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా పోలీస్ విధులు ఉండాలని,పోలీస్ అధికారులు, సిబ్బంది స్టేషన్ పరిధిలోని గ్రామాలు,వార్డులు పర్యటిస్తూ ఇన్ఫర్మేషన్ వ్యవస్థ పటిష్టం చేయాలని అధికారులకు సూచించారు.
డయల్ 100 కాల్స్ కి వెంటనే స్పందించి బ్లూ కోల్ట్, పెట్రో కార్ సిబ్బంది, అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని సమస్యలు పరిష్కరించాలని,పెట్రోలింగ్ సమయంలో స్టేషన్ పరిధిలోని చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు నిర్వహించే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని,రౌడి షీటర్స్,హిస్టరీ షీటర్స్,అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిఘా కఠినతరం చేయాలన్నారు.
అసాంఘిక కార్యకలాపాలు అయిన గంజాయి,అక్రమ ఇసుక రవాణా, పిడియాస్ రైస్ అక్రమ రవాణా పై ఉక్కుపాదం మోపాలన్నారు.పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలపై నిఘా పటిష్టం చేస్తూ గంజాయి నివారణకు పకడ్బందీగా చర్యలు చెపడుతు,గంజాయి వలన కలుగు అనర్ధాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు.రోడ్డు ప్రమాదాల నివారణకు స్టేషన్ పరిధిలో వాహనాల తనిఖీలు,డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టాలన్నారు. డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సి.ఐ లు శ్రీనివాస్,మొగిలి, ఎస్.ఐ ప్రేమనందం,సిబ్బంది ఉన్నారు.