06-03-2025 01:04:06 AM
ఎస్‌ఈ మేక రమేష్ బాబు
కరీంనగర్ క్రైం, మార్చి 5: జిల్లాలో నిరంతరాయంగా విద్యుత్ అందించాలని విద్యుత్ శాఖ ఎస్‌ఈ మేక రమేశ్ బాబు అధికారులను ఆదేశించారు. బుధవారం నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రి, మాతా శిశు కేంద్రం, కలెక్టరేట్, జిల్లాలోని అన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్స్, వాటర్ వర్క్స్, మిషన్ భగీరథ, ఫిల్టర్ బెడ్, ఐటీ పార్కు ఫీడర్లను ఎస్‌ఈ అధికారులతో కలిసి పరిశీలించారు. అన్ని హాస్పిటల్స్లో ఉన్న ఆటో జనరేటర్ వర్కింగ్ కండిషన్ను పరిశీలించి వాడకంలోకి తీసుకోవాల్సిందిగా సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ అందించాల్సింది గా సూచించారు. ఈ కార్యక్రమంలో డీఈ రాజం, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ వీరారెడ్డి, ఏడీఈ పంజాల శ్రీనివాస్ గౌడ్, ఏఈ, తదితరులు పాల్గొన్నారు.