22-04-2025 01:22:10 AM
పేదలకు ప్రభుత్వం వైద్యం చేరువ కావాలి
పాల్వంచ ఆస్పత్రిలో కార్పొరేట్ స్థాయి వైద్యం అందుబాటులోకి.
శాసనసభ సభ్యుడు కూనంనేని సాంబశివరావు
భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 21 (విజయక్రాంతి) ప్రభుత్వ దవాఖానాల్లో సకల సౌకర్యాల కల్పనకు నిరంతర కృషి చేస్తున్నట్టు కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు తలిపారు. సోమవారం పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రి(సిహెచ్ సి) లో రూ 1కోటి నిధులతో నూతనంగా ఏర్పాటు చేసిన ఆ ర్థోపెడిక్, ఇ.ఎన్. టి. డెంటల్, కంటి, ఓపిడి , ఆపరేషన్ థియేటర్ల ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలకు ప్రభుత్వ వైద్యం మరింత చేరువ కావాలని ఆకాంక్షించారు. పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరే ట్ స్థాయి వైద్యం అందుబాటులోకి వచ్చిందని, విద్య, వైద్యం కు తన మొదటి ప్రాధాన్యత ఉంటుందన్నారు.
వివిధ వ్యాధులతో ఆసుపత్రికి వచ్చే రోగులతో వైద్యులు, వైద్య సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, సరైన వైద్యం అందించి వారి ప్రాణాలను కాపాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డి సి హెచ్ ఎస్ డాక్టర్ రవి బాబు, పాల్వంచ తహసిల్దార్ వివేక్ మున్సిపల్ కమిషనర్ k. సుజాత, పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ రాంప్రసాద్, డాక్టర్ సోమరాజు దొర, సీపీఐ జిల్లా కార్యదర్శి SK సాబీర్ పాషా, మాజీ డీసీఎంఎస్ ఛైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు నూకల రంగారావు, కొండా వెంకన్న, సీపీఐ, కాంగ్రెస్ నాయకులు బండి నాగేశ్వరావు, ఉప్పుశెట్టి రాహుల్, గుండాల నాగరాజు, అన్నారపు వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.