జగిత్యాల అర్బన్, జనవరి 28 : జగిత్యాల నియోజకవర్గ అభివద్ధి కోసం నిరంతరం కషి చేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణానికి చెందిన 202 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాది ముభారక్ పథకం ద్వారా 2 కోట్ల 2 లక్షల రూపాయల విలువగల చెక్కులను, 59 మంది లబ్ధిదా రులకు, సీఎం సహాయనిధి ద్వారా మంజూ రైన 19 లక్షల రూపాయల విలువగల చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.
ఈ సంద ర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ జగిత్యాల పట్టణం లో కొత్తగా 6216 రేషన్ కార్డులు మంజూర య్యాయని, రాష్ర్టం లోనే అత్యధిక ఇందిర మ్మ ఇండ్లను జగిత్యాలకు మంజూరు చేయ టం కోసం తన వంతు కషి చేస్తానన్నారు. 5 వేల కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ మంజూరు కాగా, దాదాపు 20 వేల మందికి లబ్ది చేకూరుతుందన్నారు.
జగిత్యాల పట్ట ణంలో 18 వేల ఇండ్లకు ఉచిత కరెంట్ పథ కం అమలవుతుందని, 5 కోట్లతో తారకరా మ నగర్లో అడ్వాన్స్డ్ స్కిల్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నిధుల కొరతతో అర్ధాంతరంగా నిలిచిపోయిన మెడికల్ కళా శాల భవన నిర్మాణం పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య మంత్రిని కోరి నిధులు మంజూరుకు కషి చేస్తానన్నారు.
జగిత్యాల పట్టణ అభివద్దే లక్ష్యంగా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి మద్దతుగా ఉండి, బీజేపీ ఎంపీ అరవింద్’తో కలిసి పని చేస్తాన న్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో రా మ్మోహన్, మున్సిపల్ మాజీ చైర్మన్లు అడు వాల జ్యోతిలక్ష్మణ్, గిరి నాగభూషణం, మా జీ వైస్’చైర్మన్ గోలి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.