calender_icon.png 8 January, 2025 | 2:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జగిత్యాల అభివృద్ధికి నిరంతర కృషి

04-01-2025 12:12:09 AM

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ 

జగిత్యాల, జనవరి 3 (విజయ క్రాంతి): జగిత్యాల పట్టణ అభివృద్ధికి ప్రణాళిక యుతంగా, నిరంతర కృషి చేస్తానని ఎమ్మె ల్యే డాక్టర్ సంజయ్’కుమార్ అన్నారు. పట్టణంలోని 1, 16 వార్డుల్లో రూ. 40 లక్షల తో సిసి రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి ఎమ్మె ల్యే శుక్రవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణం లోని యావర్ రోడ్డు గుండా  అనంతారం వరకు 4 లైన్ల రోడ్డు ఏర్పాటుకు కృషి చేస్తాన న్నారు.

స్వచ్చ భారత్ మిషన్ లో రూ. 5 కోట్ల 60 లక్షల నిదులతో చెరువుల్లో మురుగు నీరు చేరకుండా ఎఫ్టిపిలు ఏర్పా టు చేస్తామన్నారు. ‘నగర్ వన్’ కార్యక్రమం లో భాగంగా పట్టణ ప్రజలకు ఆహ్లాదం కల్పించేందుకు అర్బన్ పార్క్ ఏర్పాటు చేస్తు న్నామని తెలిపారు.

జగిత్యాలకు కేంద్రీయ విద్యాలయం, ఏకలవ్య పాఠశాల, వ్యవ సా య రంగానికి కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పా టుకు ఎంపి అరవింద్  సహకారంతో కృషి చేస్తున్నట్టు తెలిపారు. భీరయ్య గుడి దగ్గర ధ్యాన మందిరం నిర్మాణానికి నిధులు మం జూరు చేయటం జరిగిందన్నారు. నియోజక వర్గంతో పాటూ జిల్లా కేంద్రంలో అవసర మైన అభివృద్ధి కోసం కనిపించే ప్రతి అవకా శాన్ని వాడుకుంటనన్నారు.

అవసరం ఏదైన ప్పటికీ కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల సహకారం తీసుకొని అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని ఎమ్మెల్యే సంజయ్’కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జ్యోతి లక్ష్మణ్, వైస్ చైర్మన్ శ్రీనివాస్, కమిషనర్ చిరంజీవి, కౌన్సిలర్ రాజేష్ పాల్గొన్నారు.