calender_icon.png 17 January, 2025 | 1:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొనసాగిన అప్‌ట్రెండ్

17-01-2025 01:50:04 AM

* మూడో రోజూ పెరిగిన సూచీలు

* మరో 318 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్

* 23,300 పాయింట్ల ఎగువకు నిఫ్టీ

ముంబై, జనవరి 16:యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల కోతల పట్ల తిరిగి ఆశలు చిగురించడంతో ప్రపంచ సానుకూల సంకేతాల నేపథ్యంలో దే శంలో ద్రవ్యోల్బణం తగ్గడంతో వరుసగా మూ డోరోజూ మార్కెట్ లాభపడింది. బీఎస్ ఈ సెన్సెక్స్ ఇంట్రాడేలో 77,319 గరిష్ఠస్థాయిని తా కిన అనంతరం  చివరకు మరో 318 పాయింట్ల లాభంతో  77,042 పాయింట్ల వద్ద నిలిచింది. 

నిఫ్టీ  23,300 పాయింట్ల కీలకస్థాయి ఎగువన 98పాయింట్ల లాభం తో 23,311 పాయిం ట్ల వద్ద క్లోజయ్యింది.  హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో జరిగిన కొను గోళ్లు సెంటిమెంట్‌ను మెరుగుపర్చాయని ట్రేడర్లు తెలిపారు. బీఎస్‌ఈలో ట్రేడయిన షేర్లలో 2,778 స్టాక్స్ లాభపడగా, 1,188 స్టాక్స్ తగ్గాయి.

ఇజ్రాయిల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడం మార్కెట్ మూమెంటం ను పెంచిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. భారత్ మార్కెట్ విలువలు ఈ స్థాయిలో కూడా ఖరీదుగా ఉండటంతో ఆందోళనచెందుతున్న ఇన్వెస్టర్లు ఎంపికచేసిన షేర్లలో కొనుగోళ్లు, అమ్మకాలు జరుపుతున్నారని మెహతా ఈక్విటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తాప్సే చెప్పారు.