నల్లగొండ, జనవరి 12 (విజయక్రాంతి): సంక్రాంతికి స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికులతో ఆదివారం హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి (ఎన్‌హెచ్-65)పై వాహనాల రద్దీ కొనసాగింది. యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్‌ప్లాజా వద్ద ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు భారీగా ట్రాఫిక్ రద్దీ నెలకొంది. చౌటుప్పల్ పట్టణంలో రహదారి నిండా వాహనాలే కనిపించాయి. పంతంగి టోల్‌ప్లాజా నుంచి రెండ్రోజుల్లో లక్షా 50 వేలకుపైగా వాహనాలు వెళ్లినట్లు నిర్వాహకులు తెలిపారు.