calender_icon.png 19 February, 2025 | 2:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అలిపిరి నడక మార్గంలో కొనసాగుతున్న ఆంక్షలు

15-02-2025 10:37:13 AM

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devasthanams) అలిపిరి నడక మార్గం(Alipiri steps)లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఉదయం 4గంటల నుంచి రాత్రి 9గంటల వరకు మాత్రమే భక్తులకు టీటీడీ అనుమతిచ్చింది. చిన్నారులకు మధ్యాహ్నం 12గంటల వరకే అలిపిరి నడక మార్గం గుండా అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మధ్యాహ్నం 2గంటల నుంచి అలిపిరి నుంచి భక్తులు(devotees) గుంపులుగా వెళ్లాలని టీటీడీ సూచించింది.

అటు తిరుమల వెంకన్న దర్శనానికి వచ్చిన భక్తులు 10 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 8 గంటల(tirumala darshan waiting time ) సమయం పడుతోందని ఆలయ అధికారులు తెలిపారు. నిన్న శ్రీవారిని 64,527 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న రూ. 3.70 కోట్లు శ్రీవారి హుండీ ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ(TTD) అన్ని ఏర్పాట్లు చేసింది.