calender_icon.png 15 March, 2025 | 11:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొనసాగిన నష్టాలు

05-03-2025 12:00:00 AM

73 వేల దిగువకు సెన్సెక్స్

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం కూడా నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాల నేపథ్యంలో మన మార్కెట్లూ అదే ధోరణిలో కదలాడాయి. ముఖ్యంగా రిలయన్స్, ఐటీ షేర్లలో అమ్మకాలు సూచీలను పడేశాయి. దీంతో సెన్సెక్స్ 73వేల దిగువకు చేరింది.

స్మాల్, మిడ్‌క్యాప్ స్టాక్స్ మాత్రం స్వల్పంగా లాభపడ్డాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ తాను ముందుగా ప్రకటించినట్లే చైనా, మెక్సికో, కెనడాపై టారిఫ్‌లను విధించడం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీనికి ప్రతిగా కొన్ని అమెరికా ఉత్పత్తులపై చైనా సైతం సుంకాల విధించడం వాణిజ్య యుద్ధ భయాలకు ఆజ్యం పోసింది.

సెన్సెక్స్ ఉదయం 72,817.34 పాయింట్ల వద్ద  నష్టాల్లో ప్రారంభమైంది. రోజంతా నష్టాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 72,633.54 -- 73,033.18 మధ్య కదలాడింది. చివరికి 96 పాయింట్ల నష్టంతో 72,989.93 వద్ద ముగిసింది. నిఫ్టీ 36.65 పాయింట్ల నష్టంతో 22,082.65 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 5 పైసలు మేర బలపడి 87.27గా ఉంది.

సెన్సెక్స్ 30 సూచీలో బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, నెస్లే ఇండియా, ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు నష్టపోయాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, జొమాటో, టీసీఎస్, అదానీ పోర్ట్స్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 70.58 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. బంగారం ఔన్సు ధర మళ్లీ 2,900 మార్కు దాటి 2925 డాలర్ల వద్ద కొనసాగుతోంది.