calender_icon.png 17 November, 2024 | 12:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాగర్‌లో కొనసాగుతున్న నిమజ్జనాలు

15-09-2024 01:29:43 AM

  1. వరుస సెలవులతో ట్యాంక్‌బండ్‌పై రద్దీ
  2. ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి పోటెత్తిన భక్తులు

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 14 (విజయక్రాంతి): హుస్సేన్ సాగర్‌లో గణ నాథుల నిమజ్జనం కొనసాగుతోంది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన విగ్రహాలతో ట్యాంక్‌బండ్‌పై రద్దీ నెలకొంది. వరుసగా ౪రోజులు సెలవులు రావడంతో మహానగరంలో వినాయక మండపాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. హుస్సేన్‌సాగర్‌లో గణేశ్ నిమజ్జ నానికి జీహెచ్‌ఎంసీ అధికారులు అన్ని  ఏర్పాట్లుచేశారు. ఖైరతాబాద్ సప్తముఖ మహాగణపతి దర్శనానికి భక్తులు పోటెత్తారు. శనివారం నగరంతోపా టు రాష్ట్ర నలుమూలల నుంచి మహాగణపతి దర్శనం కోసం భక్తులు తరలివచ్చారు.

ఉదయం నుంచి రాత్రి వరకు ఖైరతాబాద్ గణేశ్ ప్రాంగణం నుంచి మెట్రోస్టేషన్ వరకు భక్తులు క్యూలైన్ల ద్వారా దర్శనం చేసుకున్నారు. మరోరెండు రోజుల్లో గణేశ్ నిమజ్జ నం జరుగబోతున్న నేపథ్యంలో భక్తుల రాక రోజురోజుకూ పెరుగుతోంది. ఎర్రమంజిల్ నుంచి లక్డీకాపూల్ వరకు పలు మార్లు ట్రాఫిక్ జాం అయింది. శనివారం 5 లక్షల మందికిపైగా భక్తులు బడా గణేశుడి దర్శనానికి వచ్చి ఉంటారని పోలీసులు, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు అంచనా వేస్తున్నారు.

అయితే  ఆదివారం ప్రత్యేక పూజలు, దర్శనాలు ఉండవని, చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణులు రాకుండా జాగ్రత్త వహించాలని పోలీసులు సూచిస్తున్నారు. ఖైరతాబాద్‌కు వచ్చేందుకు ఎక్కువ మంది మెట్రోను ఆశ్ర యించడంతో స్టేషన్లు కిటకిటలాడాయి.