హైదరాబాద్: తెలంగాణలో పలు జిల్లాలో వర్షాలు కురుస్తున్నారు. దీంతో జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి. నాగార్జునసాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగుల, ప్రస్తుత నీటి మట్టం 572.70 అడుగులు ఉంది. సాగర్ నీటినిల్ల సామర్థ్యం 312.50 టీఎంసీలు. ప్రస్తుత నీటి నిల్వ 263.34 టీఎంసీలు, నాగార్జున సాగర్ ఇన్ ఫ్లూ 3,14,409 క్యూసెక్కకులు. నాగార్జునసాగర్ ఔట్ ఫ్లూ 35,409 క్యూసెక్కులుగా ఉందని అధికారులు తెలిపారు.
అటు శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం పాజెక్టు 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తి నీటి విడుదల చేశారు. శ్రీశైలం స్పెల్ వే ద్వారా 3.10 లక్షల క్యూసెక్కులు విడుదల చేశారు. జూరాల, సుంకేశుల నుంచి 4.21 లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయం పూర్తి నీటిమట్లం 885 అడుగులు కాగా, జలాశయం ప్రస్తుత నీటిమట్టం 882.90 అడుగులు. శ్రీశైలం జలాశయం పూర్తి నీటి నిల్వ 215.80 టీఎంసీలు. ప్రస్తుత నీటి నిల్వ 203.89 టీఎంసీలు. శ్రీశైలం కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో ముమ్మరంగా ఉత్పత్తి అవుతోంది. విద్యుదుత్పత్తి ద్వారా 63,489 క్యూసెక్కులు సాగర్ కు విడుదల చేశారు.