calender_icon.png 22 April, 2025 | 8:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్థిక భారమైనా సంక్షేమ పథకాల కొనసాగింపు

12-04-2025 12:21:42 AM

    - ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి 

మేడ్చల్, ఏప్రిల్ 11 (విజయ క్రాంతి): ఆర్థిక భారమైనప్పటికీ సంక్షేమ పథకాలు కొనసాగుతాయని ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం   మేడ్చల్  మల్కాజిగిరి జిల్లా శామీర్ పేట్ మండలంలోని తూముకుంట లోని ఎస్‌ఎన్‌ఆర్ కన్వెన్షన్ లో ఎంపీ ఈటెల రాజేందర్  తో కలిసి   కళ్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేసారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ప్రభుత్వంపై భారం పడుతున్న పథకాలను అమలు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని, పార్టీలకు అతీతంగా ఎంపీ తదితరులతో కలిసి మల్కాజిగిరి నియోజకవర్గం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తాం అన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణం, వంటగ్యాస్, ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు, ప్రతి నిరుపేదకు సన్నబియ్యం పంపిణీ తదితరాలు దేశంలో ఎక్కడలేని విధంగా అమలవుతున్నాయని  అన్నారు.

ఘట్కేసర్ లో 116, కాప్రా లో 36, మేడ్చల్లో 52 , మూడు చింతలపల్లిలో 25, మేడిపల్లిలో  102, షామీర్పేట్ లో 58 మొత్తం 389 మంది లబ్ధిదారులకు సుమారు 4 కోట్ల రూపాయల కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పట్నం మహేందర్ రెడ్డి, ఈటల రాజేందర్ చేతుల మీదుగా లబ్దిదారులకు పంపిణీ చేసారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఉపేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింహులు, వజ్రేష్ యాదవ్   తదితరులు పాల్గొన్నారు. అనంతరం దేవరియంజాల్ లోని శ్రీ సీతారామస్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాల కళ్యాణ మహోత్సవంలో హాజరైన ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.   ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మహేందర్ రెడ్డికి వేద బ్రాహ్మణులు ఆశీర్వచనం అందజేసారు.