calender_icon.png 26 October, 2024 | 12:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కంటెంట్ ఉంటే తప్పక ఆదరిస్తారు

24-10-2024 12:32:36 AM

సెవెన్ హిల్స్ సతీష్ ప్రస్తుతం రెండు సినిమాలను నిర్మిస్తున్నారు. ‘కాఫీ విత్ ఏ కిల్లర్’, ‘సోలో బాయ్’ చిత్రాలను ఆయన రూపొందిస్తున్నారు. వీటిలో కాఫీ విత్ ఏ కిల్లర్ సినిమాకు సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. సోలోబాయ్ చిత్రానికి పి. నవీన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.

తన పుట్టినరోజు సందర్భంగా ఈ రెండు సినిమాల గురించి సెవెన్ హిల్స్ సతీష్ మీడియాతో మాట్లాడారు. “గతంలో నేను తీసిన బట్టల రామస్వామి బయోపిక్, అందరి బంధువయా సినిమాలు నాకు మంచి పేరుని తీసుకొచ్చాయి. అలాగే రిలీజ్ కి రెడీగా ఉన్న, కాఫీ విత్ ఏ కిల్లర్, సోలో బాయ్ సినిమాలు మిమ్మల్ని అలరిస్తాయి.

కంటెంట్ ఉంటే సినిమాని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. సినిమా విడుదల ప్లాన్ చేస్తుంటే మా హీరో గౌతమ్ కృష్ణకి బిగ్‌బాస్ అవకాశం వ చ్చింది. అతను మళ్ళీ రాగానే, రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాము” అని సెవెన్ హిల్స్ సతీష్ పేర్కొన్నారు. సోలోబాయ్ చిత్రంలో గౌతమ్ కృష్ణ, శ్వేతా అవస్తి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.