calender_icon.png 27 November, 2024 | 2:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాగనూర్ బడిలో మళ్లీ కలుషిత ఆహారం

27-11-2024 12:53:05 AM

  1. మరోసారి వికటించిన మధ్యాహ్న భోజనం
  2. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
  3. మక్తల్ దవాఖానకు బాధితుల తరలింపు

మహబూబ్‌నగర్, నవంబర్ 26 (విజయక్రాంతి): వారం తిరగక ముందే మళ్లీ అదే ఘటన.. నారాయణపేట జిల్లా మాగనూర్ జడ్పీహెచ్ ఎస్ పాఠశాలలో.. మధ్యాహ్న భోజ నం వికటించి ౨౦ మంది విద్యార్థు లు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ నెల 20న కలుషిత ఆహారం తిని 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురవ్వగా, ఆ ఘటనపై సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకున్నారు.

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు. జిల్లా విద్యాశాఖాధికారితోపాటు ఇన్‌చార్జి ఎంఈ వో, పాఠశాల హెచ్‌ఎం మురళీధర్‌రెడ్డి, ఫుడ్ ఇన్‌చార్జి బాబిరెడ్డిని సస్పెండ్ చేశారు. మరో నలుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీచేశారు. అయితే మంగళవారం మాగనూర్ మరోసారి భోజనం వికటించి 20 మంది విద్యార్థులు దవాఖాన పాలయ్యారు.

వాంతులు, విరేచనాలు కావడంతో అధికారులు, ఉపాధ్యాయులు హుటాహుటిన మక్తల్ దవాఖానకు తరలించారు. వీరిలో 9వ తరగతి చదువుతున్న ఒబులాపు రం గ్రామానికి చెందిన విద్యార్థిని నేత్ర తీవ్ర అస్వస్థతకు గురికావడంతో మహబూబ్‌నగర్ జనరల్ దవాఖానకు తరలించారు. ఫుడ్ పాయిజన్ ఘటనపై జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆరా తీశారు.

తరచూ ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయని, పూ ర్తి వివరాలు సేకరించాలని సంబంధింత అధికారులను ఆదేశించారు. మక్తల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థులను మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. ఫుడ్ పాయిజన్‌కు కారకులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

గతవారం ఫుడ్ పాయిజన్ ఎందుకు అయిందో ఇప్పటి వరకు అధికారులు తేల్చలేదు. ప్రతి రోజు పరిశుభ్రతను పాటిస్తూ విద్యార్థులకు మంచి భోజనం అందించాలని ప్రభుత్వం ఎన్నిమార్లు ఆదేశిస్తున్నా అధికారులు విఫలమ వుతున్నారు. సీఎం స్పందించి విద్యార్థులకు మంచి భోజనం అందించకుంటే జైలుకు పంపిస్తామని హెచ్చరించినా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారనే వాస్తవం రుజువు అవుతున్నది.

ఇదిలా ఉండగా మాగనూరు పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురవడం బాధాకరమని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నా రు. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో వరుసగా ఫుడ్‌పాయిజన్ జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. కల్తీ ఆహారం పెడితే జైలుకు పంపిస్తామన్న సీఎం మాటలు నీటి మూటలే అయ్యాయన్నారు.