calender_icon.png 31 March, 2025 | 12:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలుషితమవుతున్న త్రాగు నీరు

28-03-2025 04:50:36 PM

బాన్సువాడ,(విజయక్రాంతి): బాన్సువాడ నియోజకవర్గం లోని బీర్కూరు మండల కేంద్రంలోని ఇందిరా కాలనీలో కలుషిత నీరు సరఫరా అవుతుంది. నీరు సరిగ్గా రాక పోవడం వల్ల త్రాగడానికి పనికి రావట్లేదని కాలనీవాసులు ఆవేదన చెందుతున్నారు. ఈ నీటిని త్రాగడం వల్ల అనారోగ్యంతో రోగాల పాలవుతున్నామన్నారు. ఎండా కాలంలో కూడా మురికి నీరు రెండు రోజులుగా నీటి కుళాయిలలో వస్తుండడంతో ప్రజలువృధాగావదిలేస్తున్నారు. ఇప్పటికైనా మరమత్తులు చేసి సరైన త్రాగు నీరు అందించాలని కాలనీవాసులు ఆవేదన చెందుతున్నారు.