calender_icon.png 22 September, 2024 | 12:07 PM

'బాల్టిమోర్' బ్యారేజి కూల్చిన నౌకా సంస్థ..యూఎస్ ముక్కు పిండి వసూలు

19-09-2024 05:26:26 PM

బాల్టిమోర్: ఇటీవల వరదల నేపథ్యంలో.. ప్రకాశం బ్యారేజి గేట్లను పడవలు ఢీకొట్టన విషయం తేలిసిందే. ఒక్కోటి 40-50 టన్నుల బరువున్న బోట్లు.. ఢీకొడితే బ్యారేజి గేట్లు దెబ్బతిని కొట్టుకుపోతాయని కొంత మంది ఇంజినీర్లు సైతంవిశ్లేషించారు. కానీ అలాంటి ఘటన ఒకటి  అమెరికాలో జరిగితే మరమ్మత్తుల కోసం ప్రజాధనాన్ని ఎందుకు వెచ్చించాలి ?.. పన్ను  చెల్లింపుదారుల డబ్బును కాకుండా  ఘటనకు కారణమైన సంస్థ నుంచి ముక్కు పిండి వసూలు చేసేలా  యూ ఎస్ న్యాయ శాఖ పనిచేసి విజయం సాధించింది.

బాల్టిమోర్ లో వంతెన కూలిన ఘటనపై అమెరికా ప్రభుత్వం భారీ నష్ట పరిహారాన్ని డిమాండ్ చేస్తోంది. అమెరికాలోని బాల్టి మోర్ లో నౌక ఢీకొనడంతో ఓ వంతెన కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మార్చిలో జరిగిన  ఈ ఘటనపై అమెరికా న్యాయశాఖ దావా వేసింది. 100 మిలియన్ల డాలర్లు(రూ.837 కోట్లు) చెల్లించాలని  సింగపూర్ కు చెందిన కార్గో షిప్ యాజమాన్యంపై వేసిన దావాలో పేర్కొంది.

బాల్టిమోర్ లో వంతెనకు వాటిల్లిన నష్టం,  నౌకాశ్రయాన్ని తిరిగి తెరవడానికి అయిన ఖర్చులకు పన్ను  చెల్లింపుదారుల డబ్బును కాకుండా ఈ ఘటనకు కారణమైన సంస్థలనుంచి పొందేలా యూ ఎస్ న్యాయ శాఖ పని చేస్తోందని యూఎస్ అటార్నీ జనరల్ మెర్రక్ గార్లాండ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు సింగపూర్ కు చెందిన గ్రేస్ ఓషన్ ప్రైవేట్, సైనెర్జీ మెరైన్ ప్రైవేట్ సంస్థలపై ఈ దావా వేశారు. సదరు నష్టపరిహారం 44 మిలియన్ల డాలర్లకు కుదించాలని ఆ సంస్థలు కోరుతున్నాయి.