ఇద్దరు దుర్మరణం
పటాన్‌చెరు, డిసెంబర్ 22: కంటైనర్ స్కూటీని ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన ముత్తంగి శివారులోని జాతీ య రహదారిపై ఆదివారం ఉదయం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. కృష్ణా జిల్లా పెడన గ్రామానికి చెందిన అశోక్‌కుమార్ భార్యతో కలిసి కొంతకాలంగా అమీన్‌పూర్ మండలం కిష్టారెడ్డిపేటలోని ఎంకే ఇనాఫ్రాలో నివాసం ఉంటున్నారు.
సంగారెడ్డిలో ఉండే తన అన్న ఇంటికి అశోక్ కుమార్ తన భార్య నాగశ్యామల, బంధువు గణేశ్ నాగవినయ్‌లు స్కూటీపై పటాన్‌చెరు నుంచి వెళ్తుండగా ఉదయం 11:45 సమయంలో ముత్తంగి జాతీయ రహదా రిపై కంటైనర్ వెనక నుంచి స్కూటీని ఢీకొట్టింది.
ప్రమాదంలో నాగశ్యామ ల, గణేశ్‌నాగవినయ్ అక్కడికక్కడే మృతి చెందగా.. అశోక్‌కుమార్‌కు తీ వ్ర గాయాలు అయ్యాయి. పోలీసు లు ఘటనా ప్రాంతాన్ని పరిశీలించి కే సు నమోదు చేసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పటాన్ చెరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.