26-04-2025 07:17:18 PM
నిర్మల్ (విజయక్రాంతి): కుటుంబంలో ఏ చిన్న సమస్యలు ఉన్న ఆర్థిక సంబంధమైన గొడవలు జరుగుతున్న పోలీసులను సంప్రదించాలని జిల్లా ఎస్పీ రాకేష్ మీనా(District SP Rakesh Meena) తెలిపారు. లక్ష్మణ చందా మండలంలోని మల్లాపూర్ గ్రామానికి చెందిన బైర ఎర్రన్న తన కుమారుడైన బైరవ అశోక్లు ఇంటి గొడుగుల కారణంగానే హత్య చేయడం జరిగిందని నిందితుని పట్టుకొని అరెస్టు చేయడం జరిగిందన్నారు.
తండ్రి కొడుకులు మధ్య వివాదాలు ఉన్నప్పుడు వారు పోలీసుల సంప్రదించినట్లయితే వారిద్దరికీ కౌన్సిలింగ్ నిర్వహించి సమస్యకు పరిష్కారం చూపే వారమని కొడుకు చనిపోగా తండ్రి కటకటాల పాలైన కుటుంబం చిన్న బిన్నమైందని ఇటువంటి ఘటనలు జరగకుండా భరోసా కేంద్రం పనిచేస్తుందని తెలిపారు. భరోసా కేంద్రం ద్వారా ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపడం జరిగిందని జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు పోలీస్ శాఖ ఎవరికి ఏ సమస్య వచ్చినా దాన్ని పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని ప్రజలు ఈ అవకాశాన్ని సద్విని చూసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐ గోవర్ధన్ రెడ్డి ఎస్సై మాలిక్ రహిమాన్ పోలీసులు పాల్గొన్నారు.