04-03-2025 01:45:10 AM
మహబూబ్ నగర్ మార్చి 3 (విజయ క్రాంతి) : మహబూబ్ నగర్ నేషనల్ అకాడమీ ఆప్ కన్స్ట్రక్షన్ సెంటర్ లో హౌసింగ్ కార్పొరేషన్ సహకారంతో మేస్త్రీలకు సోమవారంఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి 6 రోజుల శిక్షణ కార్యక్రమం ను ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హౌసింగ్ కార్పోరేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వైద్యం బాస్కర్ మాట్లాడుతూ మేస్త్రీలకు రూ 5 లక్షల బడ్జెట్ లో నాణ్యత గా ఎలా నిర్మించాలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కొత్త టెక్నాలజితో ఎలా నిర్మాణం చేయాలి ఆయన వివరించారు. పేద వారికి ఇల్లు నిర్మించు కోవాలన్న తమ చిరకాల కోరిక ఈ విధంగా నెరవేరుతుందన్నారు. న్యాక్ అధికారులు ఇండ్ల నిర్మాణం కొత్త పద్దతులు గురించి శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తారని, వారిని క్రమం తప్పకుండ హాజరు కావాలని తెలిపారు.
వారికి సేఫ్టీ మెటిరియల్, హెల్మెట్ టీ షర్ట్ బ్యాగ్, బుక్, పెన్ అందించారు. మేస్త్రిలు అవసరం అందుకే శిక్షణ నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు, ఎవరైనా శిక్షణ తీసుకోవాలనుకుంటే న్యాక్ సెంటర్ లో సంప్రదించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఉన్నారు.