21-03-2025 01:30:24 AM
పట్టించుకోని అధికారులు
కుత్బుల్లాపూర్, మార్చ్ 20(విజయ క్రాంతి): గాజులరామారం సర్కిల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా నో టీసులు ఇచ్చాం అంతే మా పని అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అధికారులకి చర్యలు తీసుకునే ఉద్దేశం ఉంటే ఇదే నెలలో సూరారం పరిధిలోని సిద్ధి వినాయక నగర్ లో అక్రమ నిర్మాణాలపై తీసు కున్నట్టు సర్కిల్ పరిధిలోని మిగతా నిర్మాణాలపై ఎందుకు తీసుకోవడం లేదని స్థానికు లు ప్రశ్నిస్తున్నారు.
ఒప్పందం కుదరకనే సదరు నిర్మాణాలపై చర్యలు తీసుకున్నారని, మిగతా నిర్మాణదారులతో ఒప్పందం కుదరడంతో అటువైపు కన్నెత్తి చూడడం లేదు. కనీసం అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడానికి తీసుకున్న చర్యలపై వివరణ అడిగిన నియమాల ప్రకారం తీసుకుంటామని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయడం కేవలం గాజులరామారం పట్టణ ప్రణాళిక అధికారులకే దక్కుతుంది. ఇటీవలే విజయ క్రాంతి దినపత్రికలో ‘అనుమతులు ఒకలా.. నిర్మాణాలు మరోలా‘ అనే శీర్షికతో అక్రమ నిర్మ ణాలపై ప్రచురితమైన కథనంతో అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇంకా చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
అధికారులు, అక్రమార్కుల చీకటి ఒప్పందాలే కారణమని సందేహం కలుగక మానదు. ఇప్పటికైనా దండుకోవడం మానేసి, గాజులరామారం పట్టణ ప్రణాళిక అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి అక్రమ నిర్మాణాలపై ఎలాంటి పక్షపాతం లేకుండా చర్యలు తీసుకోవాలని లేదంటే ఉన్నతాధికారులైన కలుగ చేసుకోని అక్రమాలకు సహకరించే అధికారులతో పాటు అక్రమాలపై చర్యలు తీసుకో వాలని స్థానికులు కోరుతున్నారు.
నిర్మాణాలపై దృష్టి సారిస్తున్నాం..: తుల్జా సింగ్
అక్రమాలపై గాజులరామారం సెక్షన్ అధికారి తుల్జా సింగ్ ను వివరణ కోరగా..సర్కిల్ పరిధిలో అక్రమాలు జరుగుతున్నాయి అని వాటిపై స్పెషల్ టాస్క్ ఫోర్స్(ఎస్.టీ.ఎఫ్)కు సమాచారం ఇచ్చామని, నోడల్ అధికారి వద్దే పెండిగ్ లో ఉన్నాయని, చర్యలు తీసుకోవాలని నోడల్ అధికారికి గుర్తు చేస్తున్నా మని త్వరలో అన్నిటిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.