calender_icon.png 30 October, 2024 | 8:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కచ్చా నాలా నిర్మాణం పనులను త్వరితగతిన పూర్తి చేయాలి

30-10-2024 05:15:05 PM

గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఏ.పావని వినయ్ కుమార్

ముషీరాబాద్ (విజయక్రాంతి): నత్తనడకన సాగుతున్న నూతన కచ్చా నాళా పైప్ లైన్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్  ఏ. పావని వినయ్ కుమార్ అధికారులను కోరారు. నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం ఆర్ టి సి క్రాస్ రోడ్స్ శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో నుండి  ఎస్.ఆర్.టి  ప్రధాన దారిలో జరుగుతున్న నిర్మాణ పనులను ఆమె సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కచ్చానాల పైప్ లైన్  పనులు నత్తనడకన సాగుతున్నాయని, దాని ద్వారా స్థానికులు చాలా ఇబ్బందులు ఎదుర్కుంటునట్లు స్థానికుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే జాప్యం జరుగుతున్నాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. జిహెచ్ఎంసి ఇంజినీరింగ్, వాటర్ వర్క్స్ అధికారులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు.

కలిసి పనులు జరుగుతున్న ఏరియాలో పర్యటించి ఆగ్రహం వ్యక్తం చేశారు, గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి ఎ.పావని వినయ్ కుమార్ మంచినీటి పైప్ లైన్ లను క్రమబద్ధీకరించి, ఏధావిధిగా సరఫరా కొనసాగేలా పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, జిహెచ్ఎంసి డిప్యూటీ ఇంజనీర్ గీత, ఏ ఈ, అబ్దుల్ సలామ్, వాటర్ వర్క్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ కార్తీక్ రెడ్డి మేనేజర్ కృష్ణ మోహన్, వర్క్ ఇన్స్పెక్టర్ మహేష్, మల్లేష్, సిబ్బంది, బీజేపీ డివిజన్ అధ్యక్షులు రత్న సాయి చంద్, సీనియర్ నేతలు శ్రీకాంత్, పి.నర్సింగ్ రావు, సత్తి రెడ్డి, సంజీవ్ రెడ్డి, సాయి కుమార్, జ్ఞానేశ్వర్, ఆనంద్ రావు తదితరులు పాల్గొన్నారు.