calender_icon.png 22 February, 2025 | 11:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భవన నిర్మాణ కార్మికులకు భద్రత ఇవ్వాలి

21-02-2025 07:12:51 PM

నిర్మల్ (విజయక్రాంతి): గల్ఫ్ దేశాల్లో భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు భద్రత కల్పించే విధంగా ప్రవాసమిత్ర లేబర్ యూనియన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర అధ్యక్షులు స్వదేశీ పరికిపండ్ల తెలిపారు. ఉపాధి కోసం గలుపు దేశాలకు వెళ్లి అక్కడ భవన నిర్మాణ రంగంలో వివిధ పనులు చేస్తున్న వారికి ప్రభుత్వం రక్షణ చట్టాలు కల్పించాలని మరణిస్తే ప్రభుత్వం ఆదుకోవాలని లేబర్ మిత్ర యూనియన్ డిమాండ్ చేస్తుందన్నారు. అక్కడ అన్యాయానికి గురైన వారికి సాయం అందించేందుకు నిర్మల్ లో హెల్ప్ లైన్ డెస్క్ ను ఏర్పాటు చేయడం జరిగిందని దాన్ని సద్విని చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు గీత, లావణ్య, లక్ష్మి, నారాయణ, రవి తదితరులు ఉన్నారు.