calender_icon.png 5 March, 2025 | 7:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మికుల నిరసన

05-03-2025 12:03:17 AM

ఆదిలాబాద్, మార్చ్ 4 (విజయ క్రాంతి) : భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డులో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమ పథకాలను మెరుగుపరచాలని కోరుతూ ఐ.ఎఫ్.టి.ఎఫ్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ కార్మిక శాఖ కార్యాలయం ముందు మంగళవారం ధర్నా నిర్వహించారు. అనంతరం అసిస్టెంట్ లేబర్ కమిషనర్ ముత్యం రెడ్డికి 18 సమస్యలతో కూడిన మెమోరాండం ను అందజేశారు.

ఈ సందర్భంగా ఐ.ఎఫ్.టి.ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్ నారాయణ మాట్లాడుతూ దేశంలో భవన నిర్మాణ రంగంలో రోజు రోజుకు కార్మిక వర్గం పెరుగుతున్నదన్నారు. ఆయిన వీరికి భద్రత, చట్ట బద్ధహక్కులు అమలు చేయడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందుతున్నాయని అన్నారు. పని స్థలాల్లో ప్రమాదాలు జరిగి అంగవైకల్యం గా మారి అనేకమంది మృతి చెందుతున్న వారికి ఎలాంటి సదుపాయాలు కల్పించడం లేదని అన్నారు. నాయకులు నర్సింగ్, దేవిదాస్, సుభాష్ పలువురు కార్మికులు  పాల్గొన్నారు.