22-04-2025 12:00:00 AM
కొత్తపల్లి, ఏప్రిల్ 21: కరీంనగర్ సోమవారం జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో భారతీయ మజ్దూర్ సంఘ్ (తెలం గాణ కన్స్ట్రక్షన్స్ ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.మోహన్ రెడ్డి ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కార్మిక శాఖకు మంత్రి లేడని ఎద్దేవా చేశారు.
కార్మిక శాఖ అధికారుల ఇష్టారాజ్యమైందని ఆరోపిం చారు. భవన నిర్మాణ కార్మికులకు చెందవల సిన నిధులను పక్కదారి పట్టించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు సత్యనారాయణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు పప్పుల సురేష్,ప్రదీప్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కరీంనగర్ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు పసుల శ్రావణ్,తోర్తి శ్రీనివాస్,మోగిలిపాలెం తిరుపతి మరియు సత్యం పాల్గొన్నారు.