calender_icon.png 26 October, 2024 | 11:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తి చేయాలి

22-07-2024 01:44:12 AM

ప్రభుత్వ వైద్య కళాశాలను పరిశీలించిన మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్, జూలై 21 (విజయక్రాంతి) : మెద క్ జిల్లా కేంద్రం పిల్లికొట్టాల్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలను ఆదివారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. వైద్య కళాశాలలో డాక్టర్లు, సిబ్బంది కొరత వేధిస్తున్నం దున వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసి రిక్రూట్‌మెంట్ చేపట్టాలని మెడికల్ సూపరింటెండెంట్‌కు ఆదేశాలు జారీ చేశారు. త్వరితగతిన వైద్య కళాశాల బిల్డింగ్ పూర్తి చేసి ఉపయోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. కార్యక్రమంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ రవీంద్ర కుమార్, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.