calender_icon.png 24 February, 2025 | 4:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాసిరకంగా అందవెల్లి వంతెన నిర్మాణ పనులు

24-02-2025 12:43:29 AM

బీఆర్ ఎస్ నేత, డా. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్

కాగజ్ నగర్, ఫిబ్రవరి 23 ( విజయ క్రాంతి ):కాగజ్ నగర్ మండలం అందెవెల్లి పెద్దవాగు వంతెన పునఃనిర్మాణ పనులను  భారాస రాష్ట్ర నాయకులు డా. ఆర్. ఎస్. ప్రవీణ్ కుమార్ ఆదివారం పరిశీలించారు. మూడేళ్ళ క్రిందట భారీ వర్షాలకు పెద్దవాగు ఉప్పొంగడంతో దహేగాం వైపు ఉన్న పిల్లర్లు కుంగిపోయి వంతెన కూలిపోయింది. దీంతో వంతెనకు అటువైపు  గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

వంతెన పునఃనిర్మాణ పనులు చేపట్టాలని ప్రభుత్వం అధికారులను అదేశించిగా మూడు పిల్లర్లు, నాలుగు స్లాబులతో నిర్మాణం చేపట్టారు. స్థానిక నాయకులతో కలిసి వంతెనను సందర్శించిన ఆర్.ఎస్.పి మాట్లాడుతూ రెండేళ్లు గడుస్తున్నా ఇంకా పనులు కొనసాగుతూనే ఉన్నాయని, నిర్మాణ పనులు సైతం నాసిరకంగా ఉన్నాయని ఆరోపించారు. ప్రభుత్వాలు మారినా ఎమ్మెల్యేలు మారినా కాగజ్ నగర్, దహేగాం మండలాల ప్రజల కష్టాలు తొలగడం లేదని వాపోయారు.