calender_icon.png 4 April, 2025 | 6:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాగునీటి పైప్ లైన్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి

03-04-2025 11:50:40 PM

బీఆర్‌ఎస్ యువ నాయకుడు ముఠా జైసింహ

ముషీరాబాద్ (విజయక్రాంతి): తాగునీటి పైప్‌లైన్ నిర్మాణ పనులను త్వరిత గతిన పూర్తి చేసి ప్రజల ఇబ్బందులను తొలగించాలని బీఆర్‌ఎస్ యువ నాయకుడు ముఠా జైసింహ సంబంధిత అధికారులను కోరారు. ఈ మేరకు గురువారం ముషీరాబాద్ డివిజన్ లోని హజార్ గల్లీ, సెయింట్ పాయిస్ స్కూల్ వీధిలో గత కొన్ని రోజులుగా మంచినీటి సమస్యతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు నరేష్ రెడ్డి, నిఖిల్ రెడ్డి, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌కు ఫిర్యాదు చేశారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే వాటర్ వరక్స్ అధికారులను సమస్య వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ విషయమై స్పందించిన అధికారులు వెంటనే మరమ్మతుల పనులను  ప్రారంభించారు. ఇట్టి  అభివృద్ధి పనులను బీఆర్‌ఎస్ యువ నాయకుడు ముఠా జై సింహ వాటర్ వరక్స్ సిబందితో కలిసి పర్యటించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ తాగు నీటి సమస్యల పరిస్కారం కోసం ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ ముషీరాబాద్ అధ్యక్షులు కొండా శ్రీధర్ రెడ్డి, కార్యదర్శి ఆకుల అరుణ్, సీనియర్ నాయకులు దీన్ దయాల్ రెడ్డి, తల్లారి శ్రీకాంత్ ముదిరాజ్, టెంట్ హౌస్ శ్రీనివాస్, సత్యనారాయణ, బాబు స్థానికులు పాల్గొన్నారు.