calender_icon.png 15 January, 2025 | 11:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్వరలో తర్నం బ్రిడ్జి నిర్మాణ పనులు

12-07-2024 12:28:43 AM

ఎంపీ నగేష్, ఎమ్మెల్యే శంకర్

ఆదిలాబాద్, జూలై11 (విజయ క్రాంతి): ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని తర్నం బ్రిడ్జిని నేషనల్ హైవే అథారిటీ అధికారులతో కలిసి ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ గురువారం పరిశీలించారు. కొంతకాలం క్రితం బ్రిడ్జికి బీటలు వారడంతో రాకపోకలను నిలిపివేశారు. ఈ నేపథ్యంలో బ్రిడ్జిని సందర్శించిన నేషనల్ హైవే అథారిటీ అధికారులకు అక్కడి పరిస్థితిని ఎంపీ, ఎమ్మెల్యేలు వివరించారు. యుద్ధ ప్రాతిపదికన తర్నం బ్రిడ్జి ఏర్పాటు చేసే విధంగా కేంద్రానికి ప్రతిపాదనలు పంపామన్నారు. నేషనల్ హైవే అథారిటీ ఆర్‌ఓ ఉషాహ మాట్లాడుతూ.. నూతన బ్రిడ్జి నిర్మాణం కోసం ఇప్పటికే నిధులు సైతం మంజూరు అయ్యాయని పేర్కొన్నారు. తరలో పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు.