calender_icon.png 28 April, 2025 | 6:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్జేడీకి ఫిర్యాదు చేసినా ఆగని నిర్మాణం

28-04-2025 12:32:02 AM

  1. తమకేమీ పట్టనట్టు అధికారుల వ్యవహారం
  2. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు

భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్ 27 (విజయక్రాంతి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని చాకలి బజారులో ముత్యాలమ్మ టెంపుల్ సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణం జరుగు తోందని, మున్సిపల్ రోడ్డును ఆక్రమించినట్లు మున్సిపల్  ఆర్ జే  డీ కి ఫిర్యాదు చేసిన యేదేచక భవన నిర్మాణం సాగుతోంది.

పాల్వంచకు చెందిన ఓ వ్యక్తి పాల్వం చలో అక్రమ నిర్మాణం, మున్సిపల్ రోడ్డు ఆక్రమణ జరిగినట్లు ఆర్ జె డీ కి గతంలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆర్ జెడ్ నుం చి గత నెలలో పాల్వంచ మున్సిపల్ కార్యాలయానికి అక్రమ నిర్మాణం పై మున్సిపల్ రోడ్డు ఆక్రమణపై క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించే నివేదిక మూడు రోజుల్లో సమర్పించాలని ఆదేశించారు.

ఆర్జెడి ఆదేశాలను సైతం మున్సిపల్ అధికారులు ఖాదర్ చేయకపోవడంతో అక్రమ నిర్మాణం యేదేచగా కొనసాగుతోంది.  ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ కల్పించుకొని అక్రమ నిర్మాణాలపై కొరడా జుల్పించాలని పాల్వంచ పట్టణ ప్రజలు కోరుతున్నారు.