calender_icon.png 3 April, 2025 | 4:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సేవాలాల్ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణం

02-04-2025 05:20:43 PM

జగదాంబ, సేవాలాల్ మహారాజ్, రామ్ రావు మహారాజ్ గుడి నిర్మాణం..

35 మంది స్వాములు సేవాలాల్ మహారాజ్ దీక్ష..

పెద్ద కోడప్గల్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పెద్ద కోడప్గల్ మండలంలోని కాటేపల్లి తండాలో కాయితి లబాన్ లంబాడాలు సేవాలాల్ మహారాజ్ దీక్షను 35 మంది తీసుకున్నారు. భిక్షలో భాగంగా స్వాములు భిక్ష చేసిన తర్వాత తండా ప్రజలకు అన్నదానం చేయడం జరిగింది. తదనంతరం ఆలయ కమిటీ అధ్యక్షులు రంజిత్ మాట్లాడుతూ... సేవాలాల్ మహారాజ్ బంజారాల ఆరాధ్య దైవమని ఆ రోజులలో బంజారా పరువు ప్రతిష్టలను గురించి ముందుగానే ఊహించి హింస సిద్ధాంతానికి పునాది వేసి ఆచరించి చూపారు.

సేవాలాల్ మహారాజ్ బోధనల ద్వారా బంజారా జాతి పురోగమించింది అని తెలిపారు. ఆలయ కమిటీ అధ్యక్షతన గుడి నిర్మాణం జరిగిందని గుడి కాంపౌండ్ వాల్ నిర్మాణం మిగిలిందని, సేవాలాల్ మహారాజ్ దీక్ష తీసుకున్న 35 మంది స్వాములకు ఉండడానికి ఇబ్బంది ఉందని ఒక ఆలయ కమిటీ హాల్ నిర్మాణానికి ప్రభుత్వం లేదా ఎవరైనా దాతలు ఉంటే సహాయ సహకారాలు అందించగలరని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో చందా నాయక్, కరణ్ సింగ్, శంకర్, బాలాజీ, బహుసింగ్, దేవిసింగ్, కిషన్, గణేష్, హరి సింగ్, ఆలయ కమిటీ సభ్యులు, తండావాసులు తదితరులు పాల్గొన్నారు.