calender_icon.png 22 February, 2025 | 2:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.7.50 కోట్లతో ఆర్టీఏ కార్యాలయ నిర్మాణం

21-02-2025 01:19:37 AM

 నెల రోజుల్లో ఆర్టీఏ కార్యాలయాన్ని షిఫ్ట్ చేయండి

స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణిక రెడ్డి 

నారాయణపేట, ఫిబ్రవరి 20(విజయ క్రాంతి): నారాయణపేట ఎమ్మెల్యే డా చిట్టెం పర్ణిక రెడ్డి  లోకపల్లి లక్ష్మమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు.  జిల్లా రోడ్డు రవాణ సంస్థ నూతన కార్యలయా భవన సముదాయాన్ని రూ.7.50 కోట్లతో త్వరలోనే నిర్మాణాము చేపట్టడం  జరుగుతుందని ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణిక రెడ్డి  స్పష్టం చేశారు. బుధవారం జిల్లా కేంద్రానికి సమీపంలోని లోకాయపల్లి లక్ష్మమ్మకు ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ఆర్టీఏ కార్యాలయ నిర్మాణం చేపట్టే ప్రభుత్వ 5 ఎకరాల స్థలాన్ని పరిశీలించారు. యాద్గీర్ రోడ్‌లోని ఆర్టీఓ కార్యాలయాన్ని నెల రోజుల్లో ఇక్కడికి సిఫ్ట్ చేయాలని ఆర్టీఏ మేఘా గాంధీకి ఎమ్మెల్యే సూచించారు. ప్రస్తుతం నెల రోజుల్లో ట్రాక్ పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేసి సేవలను వినియోగంలోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. త్వరలోనే టెండ ర్లు పూర్తి అయి పనులు వేగవంతం చేయాలనీ అన్నారు.

ఆర్టీఏ కార్యాలయం ఈ ప్రాం తంలో ఏర్పాటు చేయడంతో అభివృద్ధికి అడుగులు పడతాయన్నారు. అ పక్కనే ఉన్న స్థలం పై ఎమ్మెల్యే అరా తీశారు. బైరంకొండ శివారు వరకు ప్రభుత్వ భూములు దాదాపు 92 ఎకరాల వరకు ఉంటాయని ఎక్లాస్‌పూర్ వాసులు ఎమ్మెల్యేకు తెలియజేశారు. గతంలో ఇక్కడే 50 ఎకరాలు సైనిక్‌స్కూల్ కోసం ప్రతిపాదనలు పంపించారని, రెండు ఎకరాలు ఎక్సుజ్‌శాఖ కార్యాలయానికి భూ మి కెటాయించేందుకు గ్రామ పంచాయితీలో తీర్మాణాలు చేసినట్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. 

నియోజకవర్గం అభివృద్ధి లో అందరూ భాగస్వామ్యం కావాలని ఆ గ్రామస్థులను ఎమ్మెల్యే కోరారు. ఎమ్మెల్యే తో పాటు మార్కెట్ చైర్మన్ ఆర్.శివారెడ్డి, ఆర్టీఏ జిల్లా మెంబర్ పోషల్ రాజేశ్‌కుమార్, జిల్లా మత్స్యసహకార సంఘం అద్యక్షులు కాంతుకుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు రవికుమార్ చారీ, రాజురెడ్డి, భాస్కర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.