calender_icon.png 2 November, 2024 | 12:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణాన్ని వెంటనే మొదలు పెట్టాలి

30-08-2024 04:18:06 PM

తెలంగాణ జలసాధన సమితి అధ్యక్షుడు నైనాల గోవర్ధన్ 

ఎమ్మెల్యే హరీష్ బాబుతో కలిసి ప్రెస్ మీట్

కుమ్రంభీం ఆసిఫాబాద్, (విజయక్రాంతి): ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని తెలంగాణ జలసాధన సమితి  అధ్యక్షుడు నైనాల గోవర్ధన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం సిర్పూర్ లో ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబుతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ప్రాణహిత ప్రాజెక్టును కాళేశ్వరానికి తరలించడంలో మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రస్ట్రక్చర్ లిమిటెడ్ అధినేత కృష్ణారెడ్డి హస్తం ఉందని ఆరోపించారు. రాష్ట్ర అప్పును 70 వేల కోట్ల నుంచి 7 లక్షల కోట్లకు పెంచడంలో కేసీఆర్ ఎనలేని కృషి చేశారని ఎద్దేవా చేశారు. తద్వారా రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం మొత్తంగా కాళేశ్వరాన్ని అడ్డం పెట్టుకొని అక్రమ సంపాదనకు పాల్పడ్డారని ఆరోపించారు.

పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ ఈ వార్షిక బడ్జెట్లో కేవలం రూ.250కోట్లు ప్రాణహిత ప్రాజెక్టుకు కేటాయించి కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు దులుపుకుందని ఆరోపించారు. వెంటనే డీపీఆర్ సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని డిమాండ్ చేశారు. తూర్పు ఆదిలాబాద్ జిల్లాలోని 5 నియోజకవర్గాలకు నీళ్ళు ఇచ్చిన తర్వాతనే హైదరాబాద్ నగరానికి, దక్షిణ తెలంగాణకు నీటిని తరలించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా కార్యదర్శి బండి రాజేందర్ గౌడ్, మండల అధ్యక్షులు ఎల్ములే శంకర్, ఎల్ములె మల్లయ్య, దుర్గం మోతిరాం, తుకారాం, నేరెళ్ళ అశోక్, ఒడ్డేటి నాని, దుర్గం ప్రశాంత్, సాయి, జావిద్ అహ్మద్, శ్రీను, నానాజీ తదితరులు పాల్గొన్నారు.