calender_icon.png 5 October, 2024 | 6:51 PM

జెన్కోతోనే విద్యుత్ ప్లాంట్ నిర్మాణం

05-10-2024 01:08:19 AM

కార్మిక సంఘాల డిమాండ్

భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 4 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం రామగుండం లో నిర్మించ తలపెట్టిన 800 మెగావాట్ల విద్యుత్ థర్మల్ పవర్ స్టేషన్ సింగరేణి యాజమాన్యంతో కాకుండా టీజీ జెన్కో ఆధ్వర్యంలోనే చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. శుక్రవారం భద్రా ద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేటీపీఎస్ కూడలిలో అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యం లో ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ సాయిబాబు, వైన్ చైర్మన్ ఎ ంఏ వజీర్ మాట్లాడుతూ.. టీజీ జెన్కోలో నిపుణైలైన ఇంజనీర్లు, ఇతర ఉద్యోగులు ఉన్నారని, వారిని కాదని లోపాయికారంగా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే యత్నంలో భాగంగా సింగరేణి యాజమాన్యంతో కలిసి నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తుందని ఆరోపించారు. తక్షణమే ఆ ఆలోచనను విరమించుకుని, జెన్కో ఆధ్వర్యంలోనే నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. నిరసనలో మంగీలాల్, సుధీర్, బ్రహ్మాజీ, రాధాకృష్ణ, గిరిధర్, మహేష్, సీతారాంరెడ్డి పాల్గొన్నారు.