calender_icon.png 14 March, 2025 | 8:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోడల్ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తి చేయాలి

13-03-2025 12:00:00 AM

కలెక్టర్ ఆశిష్ సంగు వాన్

కామారెడ్డి అర్బన్, మార్చి 12 ః మోడల్ ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో గృహనిర్మాణం, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, విద్యుత్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఇప్పటివరకు 19 మండలాల్లో ఇందిరమ్మ ఇండ్ల మాడల్ గృహాలు గ్రౌండింగ్ చేయడం జరిగాయని, వాటి నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని అన్నారు. అట్టి నిర్మాణాల పనులను సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు.  డోంగ్లి మండలంలో మాడల్ ఇంటి నిర్మాణాన్ని గ్రౌన్డింగ్ చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్, జడ్పీ సీఈవో చందర్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, హౌసింగ్ పీడీ విజయపాల్ రెడ్డి, విద్యుత్ శాఖ ఎస్ ఈ శ్రావణ్ కుమార్, పంచాయతీ రాజ్, గృహనిర్మాణ శాఖల ఇంజనీర్లు పాల్గొన్నారు.

లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్లను త్వరగా నిర్మించుకోవాలి..

ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులు ఇళ్లను త్వరగా నిర్మించుకోవాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం బిక్నూర్ మండలం ర్యాగట్ల పల్లి గ్రామంలో లబ్ధిదారురాలు నాగి వనజ భరత్ ఇంటి నిర్మాణం కోసం ముగ్గు పోసిన దానిని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు వెంటనే నిర్మాణం పనులు ప్రారంభించాలని తెలిపారు. కార్యక్రమంలో గృహనిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయ్ పాల్ రెడ్డి, తహసీల్దార్ శివప్రసాద్, ఎంపీడీఓ రవికిరణ్, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.

వడదెబ్బ తగలకుండా చూడాలి..

వేసవి కాలంలో వడదెబ్బ తగలకుండా ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ హాలులో వైద్యం, పంచాయతీ, మున్సిపల్, గ్రామీణాభివృద్ధి, తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వేసవి కాలంలో ప్రజలకు వడదెబ్బ తగలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురయిన వాటిని వెంటనే ఆసుపత్రులకు తరలించి వైద్య సేవలు అందించాలని తెలిపారు.

రాష్ట్రీయ బాలస్వస్త్ కార్యక్రమం కింద విద్యార్థులకు కంటి పరీక్షలు

కంటి చూపు సమస్యలను పరిశీలించి అవసరమైన వారికి కళ్ల జోళ్లు అందించడం జరుగుతున్నదని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం భిక్నూర్ మండలం జంగంపల్లి మహాత్మా జ్యోతి రావు ఫూలే బాలికల రెసిడెన్షియల్ స్కూల్, జూనియర్ కళాశాలలో దృష్టి లోపం కలిగిన విద్యార్థినులకు కళ్ల జోళ్ళ పంపిణీ కార్యక్రమం జరిగిందని. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్రీయ బాల స్వస్త్ కార్యక్రమం క్రింద జిల్లాలోని ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లోని విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుచున్నదని, దృష్టి లోపం కలిగిన విద్యార్థులకు కళ్ల జోళ్ల ను ఉచితంగా అందించడం జరుగుతున్నదని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కళ్ల స్క్రీనింగ్ నిర్వహించడంతో పాటు అవసరమైన కళ్లద్దాలు అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ చంద్రశేఖర్, ఆప్తమాలిస్ట్ డాక్టర్ రవీందర్, ఆర్బ్ ఎస్కే డాక్టర్ మనోజ్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ విజయ మహాలక్ష్మి, ప్రిన్సిపాల్ విమలా దేవి, తహసీల్దార్ శివ ప్రసాద్, ఎంపీడీఓ రవికిరణ్, తదితరులు పాల్గొన్నారు.