calender_icon.png 20 March, 2025 | 12:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోడల్ ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణాలు వేగవంతం చేయాలి

19-03-2025 08:42:07 PM

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్..

కామారెడ్డి (విజయక్రాంతి): మోడల్ ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు, రెండు పడక గదుల ఇండ్ల కాలనీలకు మిషన్ భగీరథ నీటి సరఫరాలపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రతీ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్లు మోడల్ ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని, అందుకు మంజూరు ఇవ్వడంతో పాటు పనులు ప్రారంభించడం జరిగాయని, అట్టి నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. రెండు పడక గదుల ఇళ్ల కాలనీలకు మిషన్ భగీరథ నీటిని సరఫరా చేయుటకై పైప్ లైన్ లు, ట్యాంకులు, సంపుల నిర్మాణాలు త్వరితగతిన చేయాలని అన్నారు. మిషన్ భగీరథ ఇంట్ర పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. బ్లాక్ మేకింగ్ యూనిట్ల తయారుకు మహిళా సంఘాలకు యూనిట్లు మంజూరు చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్, జడ్పీ సీఈవో చందర్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, హౌసింగ్ పి.డి. విజయపాల్ రెడ్డి, మిషన్ భగీరథ, హౌసింగ్ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.