24-02-2025 04:21:14 PM
రాష్ట్ర హౌసింగ్ ఎండి గౌతమ్, జిల్లా కలెక్టర్ తేజస్వి నందలాల్ పవార్..
నడిగూడెం (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ మోడల్ ఇంటి నిర్మాణాలను అన్ని మండల కేంద్రాలలో సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర హౌసింగ్ బోర్డు మేనేజ్మెంట్ డైరెక్టర్ గౌతమ్ స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో నిర్మిస్తున్న ఇందిరమ్మ మోడల్ ఇంటి నిర్మాణ పనులను ఆయన జిల్లా కలెక్టర్ తేజస్వి నందలాల్ పవార్ తో కాలి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఐదు లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణాలు పూర్తి చేసి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని వారు అధికారులు సూచించారు.
మండల కేంద్రంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇల్లు బెడ్రూమ్, హాల్, కిచెన్, టాయిలెట్స్ నిర్మాణాలను క్షుణ్ణంగా పరిశీలించారు. హౌసింగ్ పీడీ ధర్మారెడ్డి మోడల్ హౌస్ వివరాలను వారికి వివరించారు. సూర్యాపేట, హుజూర్నగర్, కోదాడ నడిగూడెం మండల కేంద్రాల్లో తాపీ మేస్త్రులకు శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఇందిరమ్మ మోడల్ హౌస్ ప్రత్యేకతలను, నిర్మాణాలకు అవసరమయ్యే బిల్డింగ్ మెటీరియల్ సరఫరా చేసే వ్యాపారస్తులతో చర్చించి తక్కువ ధరలతో సప్లై చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్వి నందలాల్ పవర్ అధికారులను కోరారు.
5 లక్షల రూపాయలకు మించకుండా పనులు పూర్తి చేయాలని చూసించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి డీఎఫ్ఓ సతీష్ కుమార్, ఆర్డీవో సూర్యనారాయణ, తహశీల్దార్ సరిత, వర్క్ ఇన్స్పెక్టర్ షేక్ అబ్దుల్లా, ఎంపీడీవో దాసరి సంజీవయ్య, హౌసింగ్ ఏఈ జె మూర్తి, ఎంపీఓ విజయ్ కుమారి, సూపరిండెంట్ సయ్యద్ ఇమామ్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ఇర్ఫాన్, ఇందిరమ్మ మోడల్ఇంటి నిర్మాణ మేస్త్రి ఎండి అఫ్జల్, పంచాయతీ కార్యదర్శి ఎలక ఉమారాణి కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.