25-04-2025 01:41:06 AM
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూత్ర పాయ ఆమోదం
బాటసింగారం హెచ్‌ఎండీఏ లాజిస్ట్ పార్క్ లో పార్కింగ్ సమస్య
అబ్దుల్లాపూర్మెట్, మార్చి 07: అంతర్జాతీయ ప్రమాణాలతో గడ్డిఅన్నారం వ్యవసా య సమీకృత ఫ్రూట్ మార్కెట్ నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. హైదరాబాద్ శివారు ప్రాంతం అబ్దుల్లాపూర్మెట్ మండలం కొహెడలో రూ.1901.17 కోట్లతో 500 ఎకరాలు కేటాయించగా.. ఇందులో దాదాపు 200 ఎకరాలలో మార్కెట్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
మా ర్కెటింగ్ శాఖ సమగ్ర ప్రాజెక్టు (డీపీఆర్)ను రూపొందించి ప్రభుత్వానికి పంపింది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి మార్కెట్ నిర్మాణం పై సూత్రప్రాయ ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఇంకా పనులు ప్రారంభించేందుకు చక చక అడుగులు పడుతున్నాయి. గతంలో గడ్డిఅన్నారం మార్కెట్ కొత్తపేటలో 22 ఎకరాలలో కొనసాగేది. హైదరాబాద్ నగరం విస్తరించడంతో విపరీతమైన వాహనాల రద్దీ ఏర్పడింది.
దీంతో 2021లో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో గడ్డిఅన్నారం మార్కెట్ను కొహెడకు తరలించారు. అక్కడ తాత్కాలికంగా షెడ్లను ఏర్పాటు చేశారు. గాలివానలు బీభత్సం సృష్టించడంతో మార్కెట్లో షెడ్లలన్నీ కూలిపోయాయి. ఆ సమయంలో మార్కెట్లో ఉన్న కొంత మరణించడం కూడా జరిగింది. దీంతో మార్కెట్ బాటసింగారం హెచ్‌ఎండీఏ లాజిస్టిక్ పార్క్ కి తరలించారు.
నూతన మార్కెట్తో తీరనున్న సమస్యలు
కొహెడలో నిర్మించే మార్కెట్ వలన అనేకమైన సమస్యలు తీరనున్నాయి. మార్కెట్ వాహనాలు ఓఆర్‌ఆర్ నుంచి రాకపోకలు సాగించవచ్చు. అదే విధంగా మార్కెట్ వచ్చే వాహనాదారులకు ట్రాఫిక్ సమస్య కూడా తగ్గుతుంది. ముఖ్యంగా మార్కెట్ వచ్చే వా హనాలకు పార్కింగ్ సమస్య ఎక్కువగా ఉం టుంది.
కొహెడలో నిర్మించబోయే మార్కెట్లో పార్కింగ్ కోసం 16.59 ఎకరాలు, 48.71 ఎకరాలు పండ్లు వ్యాపార, మౌలిక వసతుల కోసం, 56.05 ఎకరాలు రోడ్ల కోసం, 17.27 నాలా, గ్రామరోడ్ల కోసం, 10.98 పూలు, డ్రైపూట్స్, పాడి, చేపలు, పౌల్ట్రీ, మాంసం, ఫుట వంటి ఉత్పత్తుల, కోల్డ్‌స్టోరేజీ వంటి వాటికోసం కేటాయించారు. వీటితోపాటు పోలీస్ స్టేషన్, ఫైర్ స్టేషన్, దవాఖాన, విశ్రాంతిగదులు, విద్యుత్ వంటి నిర్మాణాలు చేపడుతారు.
ప్రత్యేక ఆకర్షణగా టవర్ ఆఫ్ ఎక్స్ లెన్స్
100 అడుగుల ఎత్తులో 19, 375 చ, అడుగుల స్థలంలో నిర్మించే టవర్ ఆఫ్ ఎక్స్టెన్స్ మార్కెట్లో ప్రత్యేకమైన ఆకర్షణగా నిలువబోతుంది. ఇందులో 4 ఫ్లోర్లను వ్యా పార సంస్థలకు కేటాయించనున్నారు. 6 హైస్పీడ్ ప్యాసింజర్ లిఫ్ట్లు, హెలిప్యాడులుంటాయి.
రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ, వా ణిజ్య ఎగుమతుల లీజుపై స్థలాలు కేటాయిస్తారు. గడ్డిఅన్నారం మార్కెట్ నిర్మాణానికి కావాల్సిన భూ సేకరణ కోసం రూ.350 కోట్లు, నిర్మాణ పనులు, ఐటీ తదితర వటికోసం రూ.1,694.71 కోట్ల వెచ్చించారు.
త్వరలో పనులు ప్రారంభిస్తాం
గడ్డిఅన్నారం మార్కెట్ నిర్మాణానికి అధికారిక అనుమతులు వచ్చిన వెంటనే సీఎం రేవంత్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదగా పనులు ప్రారంభిస్తం. దేశం లో ఎక్కడ లేని విధంగా.. అంతర్జాతీయ ప్రమాణాలతో మార్కెట్ నిర్మించబోతున్నాం.మార్కెట్లో మౌలిక సదుపాయాలు రోడ్లు, పార్కింగ్, విశ్రాంతిగదులు, పోలీస్ స్టేషన్, ఫైర్ స్టేషన్ తదితర నిర్మాణాలు చేపడతాం.