11-02-2025 10:12:00 PM
కోదాడ (విజయక్రాంతి): నాసిరకం మెటీరియల్ తోటి కమ్యూనిటీ హాల్ నిర్మిస్తున్నారని గ్రామస్తులు మంగళవారం ఆరోపించారు. 10 లక్షల రూపాయలతో మండల పరిధిలోని రామలక్ష్మీపురం గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మిస్తున్నారు. నిర్మాణాలలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి అని అధికారులు తెలుపుతున్న కాంట్రాక్టర్లు పట్టించుకోకుండా నాసిరకం ఇసుకను వాడుతున్నారని తెలుపుతున్నారు. వరదలకు కొట్టుకొచ్చిన మాట్టి ఇసుకను వాడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఏదైనా నిర్మాణం చేపడితే పది కాలాలు ఉండాలని కోరుకుంటామని గ్రామస్తులు తెలుపుతున్నారు. ఇటీవల కాలంలో నిర్మిస్తున్న ప్రభుత్వ కార్యాలయాలు అన్ని వరదలకు వచ్చిన మట్టి ఇసుకతో నిర్మించడం వల్లనే 10 సంవత్సరాలు కాకుండానే శిథిలావస్థకు చేరుతున్నాయని చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రజాధనాన్ని వృధాగానీయకుండా నాణ్యత ప్రమాణాలు పాటించి నిర్మాణాలు చేపట్టాలి అని గ్రామస్తులు కోరుకుంటున్నారు.