calender_icon.png 19 February, 2025 | 1:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోడ్ లేని జిల్లాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం

16-02-2025 12:00:00 AM

  1. ఔటర్, ఆర్‌ఆర్‌ఆర్ చుట్టూ శాటిలైట్ టౌన్‌షిప్‌ల నిర్మాణం
  2. ప్రభుత్వ భూములను సంరక్షించాలి..
  3. ప్రభుత్వ ఆఫీసులపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలి
  4. ముందస్తు బడ్జెట్ సమావేశాల్లో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క 
  5. హౌసింగ్, రెవెన్యూ, ఐఅండ్‌పీఆర్ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష 
  6. హాజరైన మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

హైదరాబాద్, ఫిబ్రవరి 15 (విజయక్రాంతి): ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని ప్రారంభించాలని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క అధికారులను ఆదేశించారు. రాష్ర్టంలో ఇళ్లు లేని పేదలకు ప్రతీ నియోజకవర్గంలో 3,500 ఇండ్ల చొప్పున నిర్మించేందుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించామన్నారు.

శనివారం సచివాలయంలో రెవెన్యూ, హౌసింగ్, ఐఅండ్‌పీఆర్ ఉన్నతాధికారులతో 2025 బడ్జెట్ ప్రతిపాదనలపై మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూముల సంరక్షణపై దృష్టి సారించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.

వివా దాల కారణంగా కోర్టు కేసుల్లో ఉన్న ప్రభుత్వ భూ ములను స్వాధీనం చేసుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. సినిమా కళాకారులను ప్రోత్సహించడంతో పాటు సమాజ వికా సానికి దోహదపడే విధంగా లఘుచిత్రాలకు ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందిస్తుందన్నారు. ప్ర భుత్వ ఆలోచనలను, ప్రభుత్వ పథకాలను లఘుచిత్రాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయడానికి కావాల్సిన చర్యలు తీసుకోవాలని సమాచార శాఖ అధికారులకు భట్టి సూచించారు. 

శాటిలైట్ టౌన్ షిప్ నిర్మాణాలపై ఫోకస్

హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఔటర్, ఆర్‌ఆర్‌ఆర్ చుట్టూ పేద, మధ్యతరగతి ప్రజల కోసం శాటిలైట్ టౌన్ షిప్ నిర్మాణాలపై హౌసింగ్ శాఖ దృష్టి సారించాలన్నారు. మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేయడానికి ఎల్‌ఐజీ, ఎంఐజీ, హెఐజీ ఇండ్ల నిర్మాణానికి అనువైన ప్రాంతాలను గుర్తించి కావాల్సిన భూమి కోసం అన్వేషించాలని సూచించారు.

అద్దె భవనాల్లో కొనసాగుతున్న అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన కార్యాలయాల జాబితాను సేకరించాలని ఆదేశించారు. ప్రతినెల అద్దె చెల్లించడానికి ఆర్థిక శాఖలో ప్రత్యేకంగా ఒక సెక్షన్‌ను ఏర్పాటు చేయాలని చెప్పారు.

అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాల భవనాలపై సోలా ర్ విద్యుత్ ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఫైనాన్స్ స్పె షల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్, రెవెన్యూ సెక్రెటరీ జ్యోతి బుద్ధ ప్రకాశ్, హౌసింగ్ ఎండీ గౌతమ్, ఐఅండ్‌పీఆర్ కమిషనర్ హరీశ్ పాల్గొన్నారు.