24-03-2025 07:58:17 PM
కమలాపూర్ బస్టాండుకు కోటి రూపాయలు కేటాయించాలి..
రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో బండి సంజయ్ నిర్లక్ష్యం..
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి..
హుజురాబాద్ (విజయక్రాంతి): హుజురాబాద్ స్పోర్ట్స్ గ్రౌండ్ కోసం గత ప్రభుత్వం 10 కోట్లు కేటాయించిందని, ఇప్పటికీ 20 శాతం వరకు కూడా పూర్తయిందని వెంటనే పూర్తయ్యేలా చేసి క్రీడాకారులకు మంచి క్రీడా మైదానాన్ని అందించాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆయన నియోజకవర్గ సమస్యలతో పాటు 4 అంశాలు మాట్లాడారు. కమలాపూర్ మండలంలో కూడా కోటి 75 లక్షలతో బస్టాండ్ నిర్మాణం జరిగిందని, కోటి రూపాయలు కేటాయిస్తే పూర్తిస్థాయిలో బస్టాండ్ నిర్మాణం అవుతుందన్నారు. అలాగే ఉప్పల్లో 45 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టామని, కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ ని రెండుసార్లు ఇక్కడ నియోజకవర్గ ప్రజలు ఓట్లు వేసి పార్లమెంటుకు పంపినప్పటికీ రైల్వే బ్రిడ్జి కట్టకుండా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని అన్నారు.