calender_icon.png 25 November, 2024 | 9:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిబంధనల ప్రకారం డ్రైనేజీల నిర్మాణం చేపట్టాలి

25-11-2024 07:06:14 PM

జనసేన ఉమ్మడి జిల్లా నాయకులు మాయ రమేష్

మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో రోడ్డుకు అనుకోని నిర్మించనున్న డ్రైన్ నిబంధనల ప్రకారం నిర్మించాలని, రాజకీయ పార్టీ నాయకులకు వారి బంధుమిత్రులకు ఒక న్యాయం సామాన్య చిన్న చితకా వ్యాపారులకు ఒక న్యాయం చేస్తామంటే సహించబోమని రాజకీయ పార్టీలకు, మున్సిపల్ అధికారులకు జనసేన ఉమ్మడి జిల్లా నాయకులు మాయ రమేష్ స్పష్టం చేశారు. పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో చేపట్టనున్న డ్రైనేజీ నిర్మాణ ప్రాంతాన్ని సోమవారం పరిశీలించి మాట్లాడారు. నిత్యం ప్రయాణికులతో, రహదారులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టినప్పటికి జిల్లాలు, మున్సిపాలిటీలలో ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి రహదారులను ఆక్రమించుకొని షెడ్ లు నిర్మించి రాజకీయ దర్పం ప్రదర్శిస్తున్నారని తీవ్రంగా విరుచుకుపడ్డారు.

గతంలో రోడ్డుకు ఒకవైపు 55 ఫీట్లు డ్రైన్ నిర్మించగా, మరోవైపు నూతన డ్రైన్ నిర్మాణం చేసే క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకరిద్దరు అధికారులపై ఒత్తిడి చేస్తున్నారని ఆయన  ఆరోపించారు. రహదారులను ఆక్రమించి షెడ్ లు నిర్మించి ఎమ్మెల్యే, ఎంపీ పేర్లతో రహదారికి 43 నుండి 45 ఫీట్ల మేరకు తగ్గించి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం మానుకోవాలని ఆయన హితవు పలికారు. ప్రమాదాలు జరగకుండా మందమర్రి పాత బస్టాండ్ నుండి రామన్ కాలనీ, మేకల గడ్డ వరకు సుమారు కిలోమీటర్ వరకు రెండువైపులా 50/50 ఫిట్ల మేరకు దగ్గర ఉండి కొలతలు చేయించడం జరిగిందనీ రెండు కోట్లు రూపాయలతో నిర్మించనున్న డ్రైన్ విషయంలో నాణ్యత ప్రమాణాలు పట్టించాలని గోదావరి ఇసుకకు బదులుగా లోకల్ మట్టి ఇసుకను వాడుతున్నారని నిబంధనలు పాటించకపోతే మున్సిపల్ అధికారుల పనితీరుపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తానని ఆయన హెచ్చరించారు.