గోడలు కూల్చిన గుర్తుతెలియని వ్యక్తులు,
8 మంది అనుమానితుల అరెస్టు
అర్ధరాత్రి కుకునూరు పల్లి పోలీస్ స్టేషన్ లో బైఠాయించిన బిజెపి ఎంపీ రఘునందన్ రావు..
కొండపాక (విజయక్రాంతి): అసైన్డ్ భూమిలో అనుమతులు లేకుండా చర్చి నిర్మాణం జరుగుతుందగా ఆదివారం రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గోడలను కూల్చివేశారు. ఈ సంఘటనలో కుకునూరు పల్లి పోలీసులు 8 మంది అనుమానితులను సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. సంఘటన గురించి తెలుసుకున్న మెదక్ ఎంపీ రఘనందన్ రావు సోమవారం అర్థరాత్రి కుకునూర్ పల్లి పోలీస్ స్టేషన్ లో న్యాయం చేయాలంటూ బైటయించారు.
కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామ పరిధిలోని సార్లపల్లి గ్రామంలో అసైన్డ్ పట్టాదారు భూమిని, రైతు వేరే వ్యక్తికి అమ్మాడు. కొనుగోలు చేసిన వ్యక్తి ఆ స్థలంలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు తీసుకోకుండా చర్చి నిర్మాణం చేపట్టడంతో ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు, నిర్మాణంలో ఉన్న గోడలను కూల్చివేశారు. అందులో హనుమాన్ విగ్రహం పెట్టి కాషాయపు జెండాను కప్పారు. విషయం తెలుసుకున్న తొగుట సిఐ లతీఫ్, కుకునూరు పల్లి పోలీసులతో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఎనిమిది మంది అనుమానితులను అరెస్టు చేయగా, విషయం తెలుసుకున్న బిజెపి ఎంపీ రఘునందన్ రావు అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ లో బైఠాయించారు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.