calender_icon.png 17 March, 2025 | 1:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నియోజకవర్గంలో సీసీ రోడ్ల నిర్మాణం

16-03-2025 08:05:38 PM

బైంసా (విజయక్రాంతి): ముధోల్ నియోజకవర్గంలో రూ. 23 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ తెలియజేశారు. ఆదివారం భైంసా మండలంలోని కుంసర, కామోల్, మాటేగాం, గ్రామాల్లో రూ.44 లక్షల నిధులతో  చేపడుతున్న సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. దశ లవారీగా గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానన్నారు. పంట పొలాలకు వెళ్లడానికి  రహదారులు లేక ఇబ్బందికరంగా ఉన్నాయని, వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. త్వరలో  రోడ్ల నిర్మాణానికి నిధుల మంజూరు చేస్తానన్నారు. కామోల్ గ్రామంలో పోచమ్మ ఆలయ రోడ్డుకు రూ .10 లక్షల, మాటేగాంలో కొరడి గణపతి ఆలయానికి వెళ్లే రోడ్డు కు రూ.28 లక్షల నిధులు కేటాయించడం జరిగిందన్నారు. అదేవిధంగా కుంసర గ్రామంలో  సీసీ రోడ్డుకు రూ.6 లక్షల నిధులు ఇవ్వడం జరిగిందన్నారు.