calender_icon.png 22 April, 2025 | 1:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సొంత నిధులతో సీసీ రోడ్డు నిర్మాణం

21-04-2025 12:00:00 AM

చేవెళ్ల , ఏప్రిల్ 20 : చేవెళ్ల మున్సిపల్ పరిధి దేవునిఎర్రవల్లి వార్డులోని మల్లన్న ఆలయ చుట్టూ ఆదివారం సొంత నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. ఈ సందర్భంగా దాత సామ రంగారెడ్డి మాట్లాడుతూ.. గ్రామంలోని ప్రజల సౌకర్యార్యార్థం మల్లన్న ఆలయం ఆవరణలో రోడ్డు వేస్తున్నామని తెలిపారు. మున్ముందు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ బీఎస్‌ఎన్‌ఎల్ బోర్డు సభ్యుడు, మాజీ సర్పంచ్ సామ మాణిక్యరెడ్డి, బీఆర్‌ఎస్ మండల బీసీ సెల్ మాజీ అ ధ్యక్షుడు ఎదిరె రాములు, సీనియర్ నాయకులు ఎదిరె శ్రీశైలం, గ్రామస్తులు బక్కయ్య, చంద్రయ్య, కరికే శ్రీనివాస్, రాములు, శ్రీశైలం, సుధాకర్ రెడ్డి, రాజి రెడ్డి, మల్లా రెడ్డి, రాంరెడ్డి, మంగలి రాములు, గ్రామస్తులు పాల్గొన్నారు.